కేశనపల్లిలో సర్వే నోటీసుల కార్యక్రమం ప్రారంభం
ప్రజలు సర్వే ప్రక్రియకు సహకరించాలి
గ్రామ సర్పంచ్ పెగడ తిరుమల కుమార్
ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలం(Muttharam Mandal) కేశనపల్లి గ్రామంలో సర్వే నోటీసుల కార్యక్రమాన్ని(Survey notices program) సర్పంచ్ పెగడ తిరుమల కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో సర్వే నోటీసుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పెగడ తిరుమల కుమార్ మాట్లాడుతూ... గ్రామంలో చేపడుతున్న సర్వే ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అధికారులు అడిగే అవసరమైన వివరాలను అందజేసి సర్వే ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సర్వేకు సంబంధించిన సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు, బీఎల్‌ఓలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని సర్పంచ్ తెలిపారు.