ఎర్రవల్లి భూములపై రెండో రోజూ సర్వే

19-09-2026 | 05:00am

భూముల పంచాతీ!

  1.    388 ఎకరాలపై నిశిత పరిశీలన
  2. హద్దులు, విస్తీర్ణం, భూముల ఆధీనంపై ఆరా

గజ్వేల్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ఎర్రవల్లి భూముల(Erravalli lands)పై రెవెన్యూ అధికారుల సర్వే(Survey by revenue officials) రెండో రోజూ శుక్రవారం కొనసాగింది. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్(KCR farmhouse) సమీపంలోని ప్రభుత్వ భూములను అయిదు బృం దాలు నిశితంగా పరిశీలించాయి. ముఖ్యంగా ఎర్రవల్లి పరిధిలోని సర్వే నంబర్ 325లోని 388 ఎకరాల భూములపై ప్రత్యేక దృష్టి సారించాయి. భూముల హద్దులు, విస్తీర్ణాన్ని పరిశీలించడంతో పాటు ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలను క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధికారులు సరిపో ల్చారు.

ప్రస్తుత వినియోగం, ఆధీనంలో ఉన్న వారి వివరాలు నమోదు చేశారు. సర్వే నంబర్ 325లోని భూమి రికార్డుల్లో నమోదైన విస్తీర్ణం మేరకు క్షేత్రస్థాయిలో ఉందా.. భూముల హద్దులు ఏ మేరకు ఉన్నాయి, ప్రస్తుతం వాటిని ఎలా వినియోగిస్తున్నారు, ఎవరి ఆదీనంలో ఉన్నాయి.. అనే అంశాలను అధికారులు పరిశీలించారు. అదే విధంగా శివార్ వెంకటాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 10, 12, 13లోనూ భూములతో పాటు వరదరాజ్‌పూర్, మర్కూక్ గ్రామాల పరిధిలో సర్వే కొనసాగింది.  

మరిన్ని వార్తలు