రెజొనెన్స్ ఇన్ఫో స్కూల్ విద్యార్థుల ప్రతిభ

09-09-2026 | 05:15am

జాతీయ స్థాయి భరత నాట్య పోటీల్లో బహుమతులు

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం(Potti Sreeramulu Telugu University Auditorium)లో నిర్వహించిన 12వ జాతీయ స్థాయి భరత నాట్య పోటీల్లో ఖమ్మంలోని రెజొనెన్స్ ఇన్ఫో స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

సీనియర్స్ విభాగంలో 10వ తరగతి చదువుతున్న దృతి ప్రథమ బహుమతి, జూనియర్స్ విభాగంలో 6వ తరగతి చదువుతున్న లాస్య ద్వితీయ బహుమతులు పొందారు. విద్యార్థులు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ఆర్.వి. నాగేంద్రకుమార్, నీహా, కొండా శ్రీధర్‌కుమార్ పా ల్గొని విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, టీచర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు