తాతా మధు, నవీన్ రెడ్డిలను కోర్టుకు తరలింపు

08-09-2026 | 10:11am

హైదరాబాద్: ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు పూర్తైన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఎమ్మెల్సీలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో నారాయణగూడ పీఎస్‌కు చేరుకుని స్టేషన్ ఎదుట బైఠాయించారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు.

మరిన్ని వార్తలు