6 September, 2026 | 9:51 AM

విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే శిల్పులు ఉపాధ్యాయులు

06-09-2026 | 05:15am
  1. న్యూ బోయిన్ పల్లి ప్రభుత్వ పాఠశాల లో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు.. 
  2. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిది .. ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత

సికింద్రాబాద్, సెప్టెంబర్ 5(విజయక్రాంతి): గురువు విద్యతో పాటు విచక్షణ కూ డా నేర్పిస్తాడు. ఆ విచక్షణే మనల్ని మంచి వైపు నడిపిస్తుంది,ఈ విచక్షణ పాఠ్యపుస్తకా ల్లో ఉండదు ఉపాధ్యాయులు గుండెల్లో ఉం టుంది.భారత మాజీ రాష్ట్రపతి,ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (Birth Anniversary of Dr. Sarvepalli Radhakrishnan) వేడుకలు న్యూ బోయిన్ పల్లి ప్ర భుత్వ పాఠశాల లో ఉపాధ్యాయులు విద్యార్థులు తో కలిసి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించా రు. విద్యారంగ అభివృద్ధికి, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రకు సర్వేపల్లి రా ధాకృష్ణన్ అందించిన సేవలను ఈ సందర్భంగాఉపాధ్యాయులు స్మరించుకున్నారు.

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః

గురుర్దేవో మహేశ్వరః 

గురుః సాక్షాత్ పరబ్రహ్మ

తస్త్మ్ర శ్రీ గురవే నమః

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురా లు ప్రేమలత మాట్లాడుతూ విద్యా రంగం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ, వి ద్యార్థుల జీవితాలలో జ్ఞానం, నైపుణ్యం, ప్రతి భావంతులుగా విలువలతో తీర్చిదిద్దే కు మా ర్గనీ నిర్దేశిస్తూ, సమాజానికి నిజమైన వెలుగులు అందిస్తున్న న్యూ బోయిన్ పల్లి ప్రభు త్వ పాఠశాల ఉపాధ్యాయుల అందరికీ ప్ర ధానోపాధ్యాయు రాలు ప్రేమలత ఉపాధ్యా య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజే స్తూ, ప్రతి విద్యార్థి ప్రతిభను గుర్తించి,

వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలోఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినంద నీయమన్నారు.విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు, వారిలో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానోపాధ్యా యురాలు ప్రేమలత పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థిలు డాన్స్ చేస్తూ ఆట,పాటలతో అలరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దివ్య తేజ, వసంత,శ్రావణి,బి.పరమేశ్వరి, పద్మావతి, శ్రీలక్ష్మి,సుప్రియ,విద్యార్థుల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు