గీతాంజలిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
ఖమ్మం, సెప్టెంబర్ 5(విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని శ్రీనివాస్‌నగర్‌లోని గీతాంజలి విద్యానికేతన్ పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని (Teachers' Day) ఘనంగా నిర్వహించారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పారావు, డైరెక్టర్లు టి.పద్మ, టి.అరుణ్‌లు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు నిర్దేశించిన విధంగా ఉత్తమ విలువలతో, ఉత్తమ క్రమశిక్షణతో ఉన్నత విద్యాభ్యాసాన్ని అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రైమరీ, హైస్కూల్ విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.






