సమాజానికి ఉపాధ్యాయుడు చీకటిలో కాంతిరేఖ వంటి వాడు
05-09-2026 | 03:25pm
బోథ్. సెప్టెంబర్5( విజయక్రాంతి): సమాజంలో ఉపాధ్యాయుడు కాంతిరేఖ వంటి వాడని ఆయన విద్యార్థుల(Students)ను ఉన్నతు లుగా తీర్చిదిద్దేందుకు తన వంతు పాత్ర పోషిస్తాడ ని వేదం పాఠశాల ప్రధానోపాధ్యాయులు(Headmaster) పచ్చిపాల సంతోష్ పేర్కొన్నారు. శనివారం పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఆయన చేసిన గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయుని పాత్ర వేల కట్టలేని దని పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తుకు ఇగురు మార్గదర్శకంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు






