కేబినెట్ భేటీ ఎందుకింత కీలకం?
హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ కీలక పరిణామాలకు వేదిక కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం(Telangana Cabinet Meeting) జరగనుంది. ఈ భేటీలో ఉద్యోగులు, భూములు, సంక్షేమం, సాగునీరు, మౌలిక వసతులకు సంబంధించిన పలు అంశాలపై(Telangana Cabinet Decisions) చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 22A భూములు, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలు అంశాలపై ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి: చైనా క్యాంపస్ పేరుతో తప్పుడు ప్రచారం
22A భూములపై ఏం తేలుతుంది? రాష్ట్రంలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 22A( 22A Lands Telangana) నిషేధిత భూముల సమస్యపై కూడా ఇవాళ్టి భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ధరణి రికార్డుల్లో ఉన్న సమస్యలు, అర్హత ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం, పెండింగ్ రిజిస్ట్రేషన్ల పరిష్కారం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రావచ్చని సమాచారం.
ఇవి కూడా చదవండి: గురుకుల టెండర్ల అవకతవకలపై విచారణ చేయాలి
ఇప్పటికే ప్రభుత్వం 22A పరిధిలో ఉన్న కొన్ని ఆస్తుల విషయంలో మార్గదర్శకాలు ప్రకటించింది. GHMC, HMDA, DTCP లేదా ఇతర స్థానిక సంస్థల నుంచి అవసరమైన అనుమతులు పొందిన ఓపెన్ ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్లను నిర్దిష్ట నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తామని రెవెన్యూ శాఖ వెల్లడించింది. దీంతో తాజా కేబినెట్ భేటీలో 22A అంశంపై మరింత స్పష్టత వస్తుందా అనే ఆసక్తి నెలకొంది. పీఆర్సీపై(Telangana PRC) కూడా చర్చ.. ఉద్యోగుల పెండింగ్ సమస్యల్లో మరో కీలక అంశమైన పీఆర్సీపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, పీఆర్సీ నివేదిక, ఇతర ఉద్యోగ సంక్షేమ అంశాలు కూడా అజెండాలో ఉన్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ రివర్ ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్, కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు వంటి అంశాలు కూడా కేబినెట్ చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇవాళ్టి తెలంగాణ కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయన్న దానిపై ఉద్యోగులు, భూయజమానులు, ప్రజల్లో ఆసక్తి నెలకొంది.