తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రామపంచాయతీలకు నిధులు
21-09-2026 | 05:13pm
హైదరాబాద్: ఎన్నికలు జరగని 58 గ్రామపంచాయతీ(Gram Panchayat)లకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో జమ అయినట్లు సమాచారం. గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఎన్నికలు జరగని గ్రామపంచాయతీల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించనున్నట్లు తెలుస్తోంది.