మేడ్చల్ లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
17-09-2026 | 08:10pm
మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంలో తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) రోజు జాతీయ జెండాను ఎగురవేసిన మున్సిపల్ పట్టణ బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందిన సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.