ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

17-09-2026 | 09:36pm

మండే వీరహనుమంతరావు 

చుంచుపల్లి,(విజయక్రాంతి): కొత్తగూడెం సొసైటీ సంఘ కార్యయం(Kothagudem Society Social Work)లో సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు(Society Chairman Mande Veera Hanmantha Rao) ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు(Telangana Liberation Day Celebrations) నిర్వహించడం జరిగినది, ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఎన్నో పోరాటాల ఫలితంగా నేడు మనము అనుభవిస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రం అని, ఆనాటి నిజాం నవాబు కాలంలో దేశముకులు, రజాకార్ల బరితెగించి దౌర్జన్యాలు దోపిడీలు దొంగతనాలు స్త్రీల మాన ప్రాణాలతో చెలగాటం ఆడారు ఆనాడు రజాకారుల ఆగడాలు తట్టుకోలేక తెలంగాణ ప్రజ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు.

ఈ ప్రయత్నంలో తెలంగాణలో సుమారు నాలుగున్నర వేల మంది పోరాట యోధులు మరణించారు ఇంతటి మారణ హోమం గమనించి ఆనాటి భారత దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ  ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్  నాయకత్వంలో హైదరాబాదును సెప్టెంబర్ 16న భారతదేశ సైన్యాన్ని పంపించి చుట్టూ ముట్టడించి తెలంగాణకు విముక్తి చెందిన రోజుగా సెప్టెంబర్ 17 ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ అనేక సంక్షేమ పథకాలు విద్య వైద్యం వ్యవసాయం, పారిశ్రామికంగా ఈనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి  పాలనలో భారత దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం ప్రయాణిస్తుంది.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విభజనలో తెలంగాణ అమరవీరులను గుర్తించి వారికి నివాళులర్పించారు. తర్వాత అనేక పోరాటాల ఫలితంగా ఆనాడు తెలంగాణ అమ్మ సోనియా గాంధీ  తెలంగాణ ఇస్తామని పార్లమెంటులో ప్రకటన చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ తెలంగాణ రావడానికి అనేక అమరవీరులు  త్యాగాలు చేశారని, వారందరి త్యాగాలను వృధా చేయకుండా మనం బంగారు తెలంగాణ వైపు అడుగులు వేయాలని, తెలంగాణ అమరులను స్మరించుకుంటూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అన్నారు, 

మరిన్ని వార్తలు