తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

16-09-2026 | 06:03pm

బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ డిమాండ్

ఆలేరు,(విజయక్రాంతి): సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day)గా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆలేరు పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీ(Bike rally)లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన రోజును అధికారికంగా నిర్వహించాలని అన్నారు. విమోచన కోసం పోరాడిన వీరులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సెప్టెంబర్‌ 17 నుంచి నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప అభియాన్’ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలేరు ప్రభుత్వ పాఠశాల నుంచి దుర్గమ్మ గుడి వరకు తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించి, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య, ఫకీర్ రాజేందర్ రెడ్డి, కామిటికారి కృష్ణ, చిరిగి శ్రీనివాస్, పూజారి కుమారస్వామి గౌడ్, నంద గంగేష్, పాశికంటి సంపత్, దయ్యాల కుమార్ స్వామి, వడ్డేమాన్ నరేందర్, ఐడియా శ్రీనివాస్, తునికి దశరథ, నరసింహారెడ్డి, తోట మల్లయ్య, సుధగాని రాజు, కటికే వెంకటేష్, కాండ్రాజు శ్రీనివాస్, కళ్లెపు రాజు, ఎలగల వెంకటేష్, సుంకరి సృజన్, శేషత్వం అమరేందర్, జంపాల శ్రీనివాస్, కంతుల శంకర్, మిట్టపల్లి భాస్కర్, మాసపేట రాజు, వడ్డేపల్లి కిషన్, శాంతిరెడ్డి, నేరెళ్ల రాజు, ఐలి సందీప్, మంత్రి సాయిప్రసాద్, గడ్డం సందీప్, అంకం రాజు, శ్యామల శ్రీకాంత్, కటకం నందం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు