గుండ్రాంపల్లి గ్రామంలో అమరవీరుల స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేయాలి

17-09-2026 | 08:32pm

బీజేపీ పార్టీ  నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి

చిట్యాల,(విజయక్రాంతి): చారిత్రక నేపథ్యం కలిగిన గుండ్రాంపల్లి గ్రామంలో అమరవీరుల స్ఫూర్తి కేంద్రాన్ని(martyrs inspiration center) ఏర్పాటు చేయాలని బీజేపీ పార్టీ(BJP party) నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana prajapalana dinotsavam) పురస్కరించుకుని నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చారిత్రక నేపథ్యం కలిగిన గుండ్రాంపల్లి గ్రామంలో   ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. అనంతరం నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన పోరాటంలో అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం అమరవీరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల చరిత్రను అవమానించడమేనని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ నాయకుల మెప్పు కోసం ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చారిత్రక నేపథ్యం కలిగిన గుండ్రాంపల్లి గ్రామంలో అమరవీరుల స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం వెంటనే స్థలాన్ని కేటాయించాలని కోరారు.

తెలంగాణ విమోచన పోరాట చరిత్రను భావితరాలకు అందించేందుకు చారిత్రక ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి, తెలంగాణ చరిత్రలోని వాస్తవాలను వెలికితీసి భావితరాలకు అందిస్తామని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు వారి గ్రామాలకు గుర్తింపు కల్పించి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మైల నరసింహ, మండల ప్రధాన కార్యదర్శులు గరిషే నరేష్, పున్న విష్ణు, బూత్ అధ్యక్షులు మైల పరమేష్, రాచకొండ నరేష్, వార్డు సభ్యులు రాచకొండ శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు