జాతీయ జెండా ఆవిష్కరణ
ఉట్నూర్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ(Telangana prajapalana dinotsavam) వేడుకలను గురువారం ఉట్నూర్‌లోని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ఇంచార్జ్ ప్రాజెక్ట్ అధికారి రాజేశ్వర్(ITDA Project Officer in Charge Rajeshwar) ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇంచార్జ్ ప్రాజెక్ట్ అధికారి రాజేశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి, ప్రజాపాలన దినోత్సవ ప్రాధాన్యతను స్మరించుకున్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.