ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
జనగామ,(విజయక్రాంతి): జనగామ కలెక్టరేట్(jangaon collectorate)లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు(Telangana prajapalana dinotsavam celebrations) ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Government Whip Beerla Ilaiah) జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, మహాలక్ష్మి, గృహజ్యోతి, రూ.500 గ్యాస్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా వంటి ఆరు గ్యారంటీలు విజయవంతంగా అమలవుతున్నాయని అన్నారు. జనగామ జిల్లా అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha), అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ బాలమణి, ఆర్డీఓ గోపీరాం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.