భూనిర్వాసితుల కన్నీళ్లకు విలువ లేదా?

11-09-2026 | 11:34pm

- పాలకుల హామీలతో మోసపోతున్న నిర్వాసితులు

- టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొట్టాల యాదగిరి

గజ్వేల్: మల్లన్న సాగర్‌ కోసం పుట్టిన ఊరు, సొంత భూములను త్యాగం చేసిన భూనిర్వాసితుల కన్నీళ్లు తుడిచే పాలకులు లేకపోవడం దురదృష్టకరమని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొట్టాల యాదగిరి అన్నారు. గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ఏటిగడ్డ కిష్టపూర్‌లో తెలంగాణ రక్షణ సేన పార్టీ(Telangana Defence Force Party) జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. భూనిర్వాసితులకు రావాల్సిన ప్యాకేజీలు పూర్తిస్థాయిలో అందక, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం హామీలతో మోసం చేస్తోందని విమర్శించారు. కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పగిడాల శ్రావణి, విజయ లక్ష్మి, ఎంపీటీసీ నర్సింలు, కూరాకుల శ్రీకాంత్, లింగని రాజు, కనకరాజు, నాంపల్లి, స్వామి, మధు, కుమార్, అశోక్, కనకసేన తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున డప్పు చప్పుళ్లతో నాయకులకు ఘన స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు