డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ‘స్టెప్’ మారింది!

23-09-2026 | 04:11pm

హైదరాబాద్‌: తెలుగు సినీ డ్యాన్సర్స్‌(Film Dancers) అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసోసియేషన్‌ అధ్యక్షురాలు సుమలత ఆధ్వర్యంలోని కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ఫిల్మ్‌ ఫెడరేషన్‌(Film Federation) నిర్ణయం తీసుకుంది.ఈ వ్యవహారంపై సుమలత, రఘు మాస్టర్‌తో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మొత్తం 225 మంది డ్యాన్సర్లు హాజరయ్యారు. 

సమావేశంలో సుమలతకు 11 మంది డ్యాన్సర్లు మద్దతు తెలపగా.. రఘు మాస్టర్‌కు 214 మంది డ్యాన్సర్లు మద్దతు ప్రకటించినట్లు సమాచారం. దీంతో డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త కార్యవర్గం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.ఇదిలా ఉండగా.. అక్టోబర్‌ 11న తెలుగు సినీ డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నిర్ణయించింది. ఎన్నికలతో అసోసియేషన్‌లో కొత్త నాయకత్వం కొలువుదీరనుంది.


మరిన్ని వార్తలు