జన్వాడలో ఉద్రిక్తత

19-09-2026 | 10:42am

మియాఖాన్‌ గడ్డలో భారీ పోలీసు బందోబస్తు

మణికొండ , సెప్టెంబరు 19: (విజయక్రాంతి):  జన్వాడ మియాఖాన్‌ గడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేటీఆర్‌కు సంబంధించినదిగా ప్రచారంలో ఉన్న ఫామ్‌హౌస్‌(KTR farmhouse) వద్ద కాంగ్రెస్‌ నేతలు పరిశీలనకు వస్తారన్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 

ఫామ్‌హౌస్‌ యజమాని ప్రదీప్‌రెడ్డి(Farmhouse owner Pradeep Reddy) శుక్రవారం స్పందిస్తూ.. ఆస్తి తనదేనని, 2019లో నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసి, అనంతరం తన చిన్ననాటి స్నేహితుడైన కేటీఆర్‌కు లీజుకు ఇచ్చినట్లు తెలిపారు. భూమికి స్పష్టమైన హక్కు పత్రాలు ఉన్నాయని, అధికారులు కోరితే వాటిని సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతల కార్యక్రమానికి సంబంధించి పోలీసులు అప్రమత్తమయ్యారు. మియాఖాన్‌ గడ్డకు వెళ్లే మార్గాల్లో భద్రతను పెంచడంతోపాటు పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు