మృతుడి కుటుంబానికి మువ్వా పరామర్శ
సత్తుపల్లి, అక్టోబర్ 3(విజయక్రాంతి): సత్తుపల్లి జలగం నగర్‌కు చెందిన పెయింటర్ షేక్ పెద్ద ఖాసీం ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీజీఐడీసీ(TGIDC) చైర్మన్ మువ్వా విజయబాబు.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మువ్వా విజయబాబు మాట్లాడుతూ.. షేక్ పెద్ద ఖాసీం ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని భరించే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు సత్తుపల్లి పట్టణ 1వ వార్డు కౌన్సిలర్ మట్టా ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొన్నారు