వనదుర్గమ్మను దర్శించుకున్న టీజీపీఎస్సీ చైర్మన్

27-09-2026 | 10:18pm

* ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు 

* ఆలయ విశిష్టతను వివరించిన అర్చకులు, సిబ్బంది 

పాపన్నపేట,సెప్టెంబర్27: దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా.. మంజీరా 'ఏడు' పాయలుగా చీలి ప్రవహించే ప్రసిద్ధ ప్రాంతంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాతను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం(Telangana Public Service Commission Chairman Burra Venkatesham) ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

వారికి ఆలయ అర్చకులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో ఆలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఆలయ విశిష్టతను వివరించారు. వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు