శృంగార సన్నివేశాలకు అందుకే ఓకే చెప్తా!
సినిమా, వెబ్ సిరీస్, షార్ట్‌ఫిల్మ్, మైక్రో డ్రామా(Movies, web series, short films, micro-dramas).. ఇలా ఏది చూసినా, కాదేదీ శృంగార సన్నివేశాల(Romantic scenes)కు అతీతం అన్నట్టు తయారయ్యాయి. అలాంటి సీన్స్ వచ్చినప్పుడల్లా.. అసలు అన్నేసి కెమెరాలు ముందుంటే అంత మొహమాటంగా ఎలా నటిస్తారూ..? అనే సందేహాలు ప్రేక్షకుల్లో వస్తుంటాయి. అయితే, ఈ ఇంటిమేట్ సీన్లను ఎలా చిత్రీకరిస్తారనే ఆసక్తికరమైన వాస్తవాన్ని బయటపెట్టింది హాలీవుడ్ నటి సారా షాహి(Hollywood actress Sarah Shahi). ఈ ముద్దుగుమ్మ నటించిన వెబ్‌సిరీస్ ‘సెక్స్/లైఫ్’ ఓటీటీలో దూసుకెళుతోంది.
నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ఈ సిరీస్‌లో సారా షాహి బోల్డ్ సీన్లలో నటించింది. ఓ ఇంటర్వ్యూలో శృంగార సన్నివేశాల చిత్రీకరణ గురించి ప్రస్తావిస్తూ నటీనటులు సౌకర్యంగా ఉండటానికి ఉపయోగించే ఒక వినూత్న ట్రిక్ గురించి తెలిపింది సారా షాహి. “ఇంటిమేట్ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో ఇద్దరు నటీనటుల మధ్య గాలి తీసేసిన ఒక చిన్న యోగా బాల్‌ను ఉంచుతారు. ఎదుటి నటుడు సీన్ చేస్తున్నప్పుడు, అతను వాస్తవానికి ఆ యోగా బాల్‌ను మాత్రమే ఢీకొంటాడు.
ఆ సమయంలో నేను కేవలం ఆ బాల్ తాలూకు స్పర్శనే అనుభవిస్తాను తప్ప, ఆ నటుడిని కాదు. ఈ పద్ధతి వల్ల మనకు ఇష్టం లేని శారీరక స్పర్శలను అనుభవించాల్సిన అవసరం ఉండదు కాబట్టి, నటీనటులు మరింత స్వేచ్ఛగా నటించడానికి ఇది ఉపయోగపడుతుంది. నటీనటుల పరిమితులను గౌరవిస్తూ ఇలాంటి సన్నివేశాలను సురక్షితంగా తీయడంలో ఈ ట్రిక్ ఎంతో కీలకంగా మారుతోంది. ఈ కారణంగానే నేను శృంగార సన్నివేశాల్లో నటిచేందుకు నిరభ్యంతరంగా ఒప్పుకుంటున్నా” అని చెప్పుకొచ్చింది సారా షాహి.