రైతుల, ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

28-09-2026 | 05:30am
  1. తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీ మారారు 
  2. మంత్రుల ఫామ్ హౌస్‌లు హైడ్రాధికారుల కనబడడం లేదా?
  3. శంషాబాద్ సమావేశంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
  4. అధికారం మాత్రమే పోయింది.... ప్రజల ప్రేమ కాదు

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 27(విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా ప్రజ లకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లో ఘోరంగా విఫలమైందని బీఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR)తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శంషాబాద్లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి ఆధ్వ ర్యంలో నియోజకవర్గం కు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సర్పంచులు,మాజీ ఎంపిటిసిలు,పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

రేవంత్ రెడ్డిని నమ్ము కుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈది నట్టేనని, ’ఫ్యూచర్ సిటీ’ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ దానిని ’ఫార్మాసిటీ’గా మా రుస్తున్నారని ఆరోపించారు.స్వార్థ ప్రయోజ నాల కోసమే ఎమ్మెల్యేల పార్టీ మార్పిడి బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లోకి దూకిన ఎమ్మెల్యేల తీరును ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీ మారడం వెనుక సుల్తా న్పూర్, ఘన్సిమియాగూడ భూముల వ్యవ హారాలు, పెద్ద ఎత్తున స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. పార్టీలు మారిన నేతలకు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు.

 పరిశ్రమల నుంచి వసూళ్లు.. క్షీణించిన శాంతిభద్రతలు

రాష్ట్రంలో పరిశ్రమల నిర్వాహకుల నుంచి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున డ బ్బులు వసూలు చేస్తున్నారని, విద్యుత్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నా యని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం దోపిడీలను అరికట్టాల్సింది పోయి పోలీసు లతో డీజేలపై నిషేధాలు విధిస్తోందని మం డిపడ్డారు. నిమజ్జన ఊరేగింపుల్లో కేసీఆర్ పాటలు పెడితే డీజేలు ఆపివేస్తున్నారని, యువత సజ్జనార్, కిషన్ రెడ్డి ముందే ’దేఖేంగే’ పాటలు ప్లే చేస్తూ కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజ లలో అసంతృప్తి పెరిగితే తెలంగాణ మట్టి స్వభావం ప్రకారం ‘గడ్డిపోచ కూడా గడ్డపారై తిరగబడుతుంది‘ అని హెచ్చరించారు.

ఎయిర్పోర్టు మెట్రో రద్దు.. మూసీ సమస్యలు....

బీఆర్‌ఎస్ హయాంలో ఎయిర్పోర్టు మెట్రో కోసం టెండర్ ప్రక్రియ పూర్తయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిని ఎందుకు రద్దు చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. మురుగునీరు మూసీలో కలవకుండా ఉండటానికి గతంలో నిర్ణయించిన ఎస్టీపీ ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

మంత్రుల ఫామ్హౌస్లు హైడ్రాకు కనిపించడం లేదా?

హైడ్రా తీరుపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూల్చేస్తున్న హైడ్రాకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలకు చెందిన అక్రమ ఫామ్హౌస్లు ఎందుకు కనిపించడం లేదని సూటిగా ప్రశ్నించారు. చట్టాలు కేవలం ప్రతిపక్షాలకు, సామాన్యులకేనా అని ఆయన నిలదీశారు.

పోతే అధికారం పోయింది.. ప్రజల ప్రేమ కాదు...

కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరాభివృద్ధి పూర్తిగా పడకేసిందని, గత మూడేళ్లలో ఒక్క ఇటుక కూడా అదనంగా వేయలేకపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పేదలకు ఇచ్చామని గుర్తుచేశారు. ఇటీవల విడుదలైన ’ది ప్యారడైజ్’ సినిమాలో కేసీఆర్ పాత్ర కేవలం 4 నిమిషాలే ఉన్నప్పటికీ థియేట ర్లలో ప్రజల నుంచి వచ్చిన స్పందనే కేసీఆర్ పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనమని అన్నారు.

బీఆర్‌ఎస్కు కేవలం అధికారమే పోయిందని, ప్రజల్లో ఉన్న ప్రేమ నిరంతరం అలాగే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమకారుడు మాజీమంత్రి స్వాతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేత కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు