సీఎం టూర్ కు చకచకా ఏర్పాట్లు!
- 30న కరీంనగర్, సిరిసిల్లలో రేవంత్ పర్యటన
- పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
కరీంనగర్/సిరిసిల్ల, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కరీంనగర్, సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో ఈ నెల 30న పర్యటించనున్న నేపథ్యంలో రెండు జిల్లాల అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది.చిన్నపాటి లోపానికీ తావులేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు చిత్ర మిత్ర, గరుమా అగర్వాల్ లు ఆదేశించారు ప్రోటోకాల్ తప్పని సరిగా పాటించాలని. కార్యక్రమం ఆదర్శంగా నిలవాలి ని సూచించారు.
ఈ నెల 30న కరీంనగర్ నూతన కలెక్టరేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచే స్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల ని స్పష్టం చేశారు.కలెక్టర్ చాంబర్, సమావేశ మందిరం, అదనపు కలెక్టర్ల చాంబర్లు, మం త్రుల సమీక్ష సమావేశాల కోసం ఏర్పాటు చేసిన హాళ్లు, ఇతర గదులను ముస్తాబు చే స్తున్నారు.
నూతన కలెక్టరేట్ భవనాన్ని అ త్యంత సుందరంగా అలంకరించాలని, ప్రా రంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా నూతన కలెక్టరేట్ ప్రా రంభోత్సవం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా ప్రతి అంశాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని పేర్కొన్నారు. సీఎం, మం త్రులు, సీఎస్, పోలీసు అధికారులు, ఇతర ఉన్నతాధికారుల పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.
వారికి స్వాగతం పలకడంతో పాటు కార్యక్రమం పూర్తయ్యే వరకు సమన్వయం చేసేందుకు లైజనింగ్ అధికారులను ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాజన్న సిరిసిల్లజిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, అలాగే సిరిసిల్ల రగుడు బై పాస్ రోడ్ వద్ద ఉన్న మైదానంలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. రెండు జిల్లా ల పర్యటన నేపథ్యం లో పోలీస్ అధికారులు ట్రాఫిక్, బందోబ స్తు, భద్రతా చర్యలు ప్రణాళిక ప్ర కారం చేపట్టేందుకు సిద్ధం అయ్యారు.
సిరిసిల్లలో విస్తృత ఏర్పాట్లు
సిరిసిల్లలోని రగుడు బైపాస్ రోడ్డు వద్ద ఉన్న మైదానంలో సి ఎం బహిరంగ సభ లో పాల్గొన్నారు.బహిరంగ సభకు ముందు సిరిసిల్ల పట్టణంలో దాదాపు 4 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 1,000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు సిరిసిల్ల కలెక్టరేట్లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గీతే ఆధ్వర్యంలో సీఎం కాన్వాయ్ రాకపోకలు సాగించే అంబేద్కర్ చౌరస్తా, చంద్రం పేట చౌరస్తా వంటి ప్రధాన కూడళ్లను , రా జన్న గుడి చెరువు ట్యాంక్ బండ్ ప్రాంతాలను భద్రతా పరంగా నిశితంగా పరిశీలిం చారు. పార్కింగ్ & సభకు భారీగా జనం త రలివచ్చే అవకాశం ఉండటంతో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనా ల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. వీఐపీలు, వీవీఐపీల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం ప్రత్యేక హెలిప్యాడ్ నిర్మాణ పనులను , సభా వేదిక పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు ఇది ఇలా ఉంటే బహిరంగ సభను అత్యంత విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష మందితో జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లాల నుండి ప్రజలను తరలించేందుకు సుమారు 1,000 బస్సులను మరియు ఇతర వాహనాలను సిద్ధం చేస్తున్నారు