మెస్సీ మ్యాజిక్ ఇదిగో! (వైరల్ వీడియో)
ఇంటర్ మయామి మ్యాచ్ అంటేనే మెస్సీ(Lionel Messi free kick goal) మ్యాజిక్ కోసం ఎదురుచూసే అభిమానులకు మరో అదిరిపోయే క్షణం కనిపించింది. కొలంబస్‌లో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు. మ్యాచ్ 33వ నిమిషంలో ఇంటర్ మయామికి ఫ్రీకిక్ లభించింది. అయితే బంతి ఉన్న ప్రదేశం సాధారణంగా నేరుగా గోల్ కొట్టడానికి అనుకూలమైనది కాదు. గోల్‌పోస్ట్‌కు పక్కగా, కార్నర్ ఫ్లాగ్‌కు దగ్గరగా ఉన్న స్థానం కావడంతో మెస్సీ సహచరుల కోసం బంతిని బాక్స్‌లోకి పంపుతాడని చాలామంది భావించారు.
కానీ మెస్సీ ఆలోచన మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. నేరుగా గోల్‌పైనే(Lionel Messi latest goal) గురిపెట్టి బంతిని అద్భుతమైన వంపుతో పంపించాడు. కొలంబస్ క్రూ(Inter Miami vs Columbus Crew) గోల్‌కీపర్ ప్యాట్రిక్ షుల్ట్ చేతులు చాపినా బంతిని ఆపలేకపోయాడు. క్షణాల్లోనే బంతి నెట్‌లోకి చేరడంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. అంతకుముందు 28వ నిమిషంలో జోసెఫ్ మార్టినెజ్ పెనాల్టీ ద్వారా కొలంబస్ క్రూకు ఆధిక్యం అందించాడు. మెస్సీ గోల్‌తో ఇంటర్ మయామి స్కోరును 1-1తో సమం చేసింది.
ఈ గోల్‌తో మెస్సీ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గోల్ చేసిన ఘనతను కొనసాగించాడు. సెప్టెంబర్ 16న క్రూజ్ అజుల్‌పై క్యాంపియోన్స్ కప్ మ్యాచ్‌లో ఇంటర్ మయామి తరఫున తన 100వ గోల్ పూర్తి చేసిన మెస్సీ.. ఆ తర్వాత కూడా తన స్కోరింగ్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మెస్సీ ఫ్రీకిక్‌ను చూసిన కామెంటేటర్ టేలర్ ట్వెల్‌మన్ కూడా ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయాడు. గోల్‌కు ఉన్న అసాధారణ యాంగిల్‌ను సవాల్‌గా తీసుకుని నేరుగా లక్ష్యంగా చేసుకోవడం ఈ గోల్‌ను మరింత ప్రత్యేకంగా మార్చింది. ఇదే మెస్సీ ప్రత్యేకత. సాధారణంగా కనిపించని అవకాశంలో కూడా గోల్‌ను వెతకడం.. అందరూ ఊహించని దారిలో బంతిని నెట్‌లోకి పంపడం.. మరోసారి తన అద్భుత నైపుణ్యంతో ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం గోల్(Messi goal video) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
[DEPORTES] Desde un ángulo imposible, Messi hizo magia con un tiro libre una vez más: el 10 puso el 1 a 1 entre el Inter Miami y el Columbus Crew.pic.twitter.com/nhR2ggsJCr https://t.co/CmFPeX797q
— ElCanciller.com (@elcancillercom) September 28, 2026