నేడే తుది పోరు

22-09-2026 | 05:25am

ఆసియా క్రీడల క్రికెట్ పోటీల్లో తలపడనున్న భారత్, శ్రీలంక మహిళా జట్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఆసియా క్రీడల(Asian Games) మహిళల క్రికెట్‌(Womens cricket)లో మంగళవారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. స్వర్ణ పతకమే లక్ష్యంగా శ్రీలంక(Sri Lanka)తో భారత్ తలపడనుంది. మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో లంకపై గెలిచిన భారత్.. ఇప్పుడు కూడా గెలి చి విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరిన శ్రీలంక.. ఆసియా కప్‌లో భారత్‌తో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. 

జోరులో భారత ప్లేయర్స్

బంగ్లాతో సెమీఫైనల్‌లో ఓపెనర్ షఫాలీ వర్మ 49 బంతుల్లోనే శతకం బాదింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) మంచి ఫామ్‌లో ఉంది. అయితే మూడో స్థానంలో ఎవరిని ఆ డించాలన్న విషయంలో భారత్ ప్రయోగా లు చేస్తోంది. బంగ్లాతో సెమీఫైనల్‌లో గునాలన్ కమలినీని, జపాన్‌తో క్వార్టఫైనల్లో భార తి ఫుల్మాలిని ఆడించింది. ఇక బౌలింగ్‌లో స్పిన్నర్లే జట్టుకు ప్రధాన బలంగా నిలుస్తున్నారు. బంగ్లా మ్యాచ్‌లో నందనిశర్మ, దీప్తిశర్మ మూ డేసి, శ్రీచరణి రెండు వికెట్లు పడగొట్టారు.  

తగ్గేది లేదంటున్న లంక 

మరోవైపు శ్రీలంక జట్టు కూడా గట్టిగా బదులిచ్చేందుకు సిద్ధం అవుతున్నది. కెప్టెన్ చమరి ఆటపట్టు ఫామ్‌లోకి రావడం  జట్టు కు కలిసొచ్చే అంశం. పాకిస్థాన్ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆటపట్టు 50బంతుల్లోనే 83 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. 

తుది జట్ల అంచనా

భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, గునాలన్ కమలినీ, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, నందని శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్.

శ్రీలంక: ఇమేషా దులానీ, ఛామరి ఆటపట్టు (కెప్టెన్), హసిని పెరీరా, హర్షిత మాధవి, కవిషా దిల్హారి, హన్సిమా కరుణారత్నే, కౌశాని నుత్యంగన (వికెట్ కీపర్), మిథాలీ అయోధ్య, కావ్య కవిందీ, చాముడి ప్రబోధ, సుగంధిక కుమారి, రష్మిక సెవ్వండి, నిమాషా మీపాగే, సంజన కవిందీ.

మరిన్ని వార్తలు