సర్కార్‌కు పోయే కాలం దాపురించింది

13-09-2026 | 05:10am
  1. ఏబీవీపీ నాయకులపై అమానుష ప్రవర్తన దుర్మార్గం
  2. కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, సెప్టెంబరు 12 (విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కార్‌(Congress government)కు పోయే కాలం దాపు రించిందని, ప్రశ్నించే వాళ్లపై దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తోందని కేంద్ర హోంశా ఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) విమర్శి ంచారు. ఏబీవీపీ కార్యకర్తల(ABVP activists)పై పోలీసుల తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కో సం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేస్తే కాళ్లు, చేతులు విరగ్గొడతారా? అధికార పార్టీ నిరసనలకు రెడ్ కార్పెట్ వేసి ప్రతిపక్ష పార్టీ, విద్యార్థి సంఘాల(Student unions)పై అమానుషంగా ప్రవర్తిం చడం దుర్మార్గమని అన్నారు.

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్యాల రాకేష్‌(Malyala Rakesh)కు తీవ్ర అస్వస్థత కాగా తోటి నాయకులు సిపిఆర్ చే సి ప్రాణాలు కాపాడారని, విద్యార్థి నాయకు డు అస్వస్థకు గురికావాడానికి కారణం పోలీ సులు కాదా అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన ఏబీవీపీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని, గాయపడ్డ విద్యార్థులకు మెరుగై న వైద్య సేవలందించాలని డిమాండ్ చేశా రు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు కన్పించ డం లేదా, కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికె ట్లు ఇవ్వకపోవడంవల్ల అటు పై చదువులకు వెళ్లలేక, ఇటు ఉద్యోగాలు రాక అడ్డాకూలీలు గా మారుతున్న విద్యార్థులపట్ల మీకు కనిక రం లేదా అని ప్రశ్నించారు. తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయాలని, జీవో నెంబ ర్ 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. లేదంటే కాంగ్రెస్ మెడలు వంచి సమస్య పరిష్కారమ య్యేదాక ఉద్యమిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు