7 September, 2026 | 7:27 AM

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

07-09-2026 | 05:10am

బీఆర్‌ఎస్ మండల నాయకులు

శంకర్‌పల్లి, సెప్టెంబర్ 6 (విజయ క్రాం తి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీల్లో అమలులో తీవ్రంగా విఫలమైందని మండల బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు (BRS party leaders) అన్నారు. రాష్ట్ర బీఆర్‌ఎస్ పార్టీ పిలుపుమేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పా లనకు నిరసనగా ఆదివారం మండలంలోని మోకిల గ్రామంలో పల్లె విధ్వంసం, పడకేసిన పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో భాగంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని వాడ వాడ తిరుగుతూ పారిశుద్ధ్య పనులపై సమీక్షించారు.

ఈ సంద ర ్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభు త్వ ం హయాంలో గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు, నూతన గ్రామపంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడి భవనాల పను లు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వా డవాడలో అండర్ డ్రైనేజ్, మంచినీటి వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు, ప్రతి గ్రామంలో యువకుల కోసం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారని, ప్రస్తుతం వాటి పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని మండిపడ్డారు.

అభివృద్ధి పనులు జరగాలంటే మళ్ళీ కెసిఆర్ ప్రభు త్వం రావాలని పేర్కొన్నారు. ఎన్నికల ము ందు ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. వెయ్యి రోజుల పాల నలో రాష్ట్రం అధోగతి పాలయింది అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, పార్టీ అధినేత కేసిఆ ర్‌ను విమర్శించడం తప్ప కాంగ్రెస్ నేతలు మరే పని చేయడం లేదన్నారు. గ్రామాల్లో కెసిఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి, శశిధర్ రెడ్డి, చిన్న నరసింహులు, గోవర్ధన్ రెడ్డి, మాణిక్య రెడ్డి, రాజు నాయక్, లింగం, బద్దం సురేందర్ రెడ్డి, ఫరీద్, లేగల నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు