సర్కారు బాయి.. కల్పన టీచర్!

22-09-2026 | 05:15am

శ్రీరామ్ నిమ్మల(Sriram Lemon), వర్షిక(Varshika) హీరో హీరోయన్లుగా నటిస్తున్న సినిమా ‘సర్కారు బాయి(Government Well)’. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు లారా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. డెక్కన్ ఫిలింస్ సమర్పణలో తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. బాహుబలి ప్రభాకర్, వివరెడ్డి, నాగ మహేశ్, చలాకీ చంటి, నుపూర్ ముఖర్జీ, జ్యోతి, దేవరాజ్ పాలమూరు, మాధవి, కవిత ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.

మరోవైపు ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. హీరోయిన్ వర్షిక పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ సోమవారం ఆమె బర్త్‌డే పోస్టర్‌ను రిలీ జ్ చేసింది. సినిమాలో కల్పన టీచర్ పాత్ర లో నటిస్తున్న వర్షిక తాజా పోస్టర్‌లో చీర కట్టులో సంప్రదాయ లుక్‌లో ఆకట్టుకుంటోంది.  ఈ చిత్రానికి డీవోపీ: అమర్ జీ; సంగీ తం: శివ కే; ఎడిటర్: బీఎన్‌రెడ్డి. 

మరిన్ని వార్తలు