కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు ఆదర్శనీయం
అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి
కామారెడ్డి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) ఆశయాలను ఆదర్శనీయమని కామారెడ్డి జిల్లా(Kamareddy District) అదన కలెక్టర్ ఎన్ వై గిరి(Additional CollectorNY Giri) అన్నారు. ఆదివారం కామారెడ్డి సిఎస్ఐ చర్చ్(Kamareddy CSI Church) సమీపంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి(Jukanti Prabhakar Reddy) ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహులు, కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు సబ్బని కృష్ణ హరి,మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి, స్వామి, బిఆర్ఎస్ నాయకులు, బీసీ వెల్ఫేర్ అధికారులు నరసయ్య, చక్రధర్, బహుజన సమాజ నేతలు కొత్తపల్లి మల్లయ్య, క్యాతం సిద్దిరాములు, బీసీ సంఘ నాయకులు శివరాములు, శంకర్, రాజయ్య, నాగరాజు, శ్రీనివాస్, నరేష్, పవన్, సునీత, స్వామి, విజయశాంతి, కృష్ణ ప్రసాద్, శాంతయ్య, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.