హరీశ్ భూముల గుట్టు విప్పాలి

19-09-2026 | 05:05am
  1. అధికారంలో ఉండగా అక్రమాలు 
  2. రంగనాయకసాగర్ భూ సేకరణలో అవకతవకలు 
  3. సమగ్ర దర్యాప్తు చేయాల్సిందే 
  4. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీల డిమాండ్ 
  5. హరీశ్‌రావు వ్యవసాయ క్షేత్రం సందర్శన.. భూ పత్రాల పరిశీలన

సిద్దిపేట/కొండపాక, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): సిద్దిపేట ఎమ్మెల్యే(Siddipet MLA), మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao)కు పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా వచ్చాయో సమగ్రంగా విచారణ జరపాలని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు(Congress MPs and MLCs) డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో అధికారం అండతో భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్(Ranganayaka Sagar) సమీపంలోని హరీశ్‌రావు వ్యవసాయ క్షేత్రాన్ని(Agricultural field) శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ బృందం పరిశీలించింది. 

భూములకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తె లుసుకుంది. ఈ సందర్భంగా ఎంపీలు మ ల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాంనాయక్, కడియం కావ్య, ఎమ్మెల్సీలు దయా కర్, బల్మూరు వెంకట్ మాట్లాడుతూ.. రంగనాయకసాగర్ ప్రాజెక్టు భూసేకరణలో అవ కతవకలు జరిగాయని ఆరోపించారు. రా మంచ గ్రామ శివారులో 2012లో 2,212 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ 2,183 ఎకరాలను మాత్రమే పరిగణ నలోకి తీసుకున్నారని, మిగిలిన భూముల విషయంలో అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. 

హరీశ్‌రావు 13 ఎక రాల 12 గుంటల భూమిని కొనుగోలు చేశారని, ఆయన వ్యవసాయ క్షేత్రం చుట్టూ మ రో 10 ఎకరాల్లో సుడా ఆధ్వర్యంలో పార్కు ఏర్పాటు చేసి ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రజలు లేని ప్రాంతంలో పార్కు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. హరీశ్‌రావు ఫామ్‌హౌస్ చుట్టూ రూ.5.30 కోట్లతో రోడ్డు ఎందుకు నిర్మించారని నిలదీశారు. ప్రభుత్వం ఎకరా కు రూ.6 లక్షలు చెల్లిస్తున్న సమయంలో రైతుల నుంచి ఎకరాకు రూ.2 లక్షలకే భూ మిని ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు.

హరీశ్‌రావు ఆస్తుల మూలాలు, బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన భూ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని, అక్రమాలు తేల్చి ప్రభుత్వ భూములను అమరవీరుల కుటుంబాలకు పంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ, మహిళా జిల్లా అధ్యక్షురాలు అక్షితారెడ్డి, సోమేశ్వర్‌రెడ్డి, కాల్‌రెడ్డి పాల్గొన్నారు

వెలికట్టలో ఆరెకరాల భూమి పరిశీలన

రాజీవ్ రహదారిని ఆనుకుని వెలికట్ట గ్రామంలోని సర్వే నంబర్ 271లో ఉన్న 6 ఎకరాల 2 గుంటల వివాదాస్పద భూమిని కాంగ్రెస్ నేతలు శుక్రవారం క్షేత్ర పరిశీలన చేశారు. ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి తదితరులు భూమి ని పరిశీలించారు. కొండపాక తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డిని కలిసి పహాణీలు, 1-బి, సేత్వార్, సర్వే మ్యాప్, పట్టాదారు వివరాలతోపాటు భూమి వర్గీకరణ, హద్దులపై సమాచారం సేకరించారు.

కాగా సదరు భూమిని.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మామ హనుమంతరావు ఆక్రమించా రనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భూమిని సందర్శించి, రికార్డులను పరిశీలించినట్లు తెలిసింది.  భూమి ప్రభుత్వ/అసైన్డ్ భూమిగా ఉంటే దాని బదలాయింపు నిబంధనలకు అనుగుణంగా జరిగిందా? రికార్డు ల్లో మార్పులు ఏ విధంగా జరిగాయి? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.  

మరిన్ని వార్తలు