కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుంది...

25-09-2026 | 04:41pm
  1. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా పనిచేయాలి
  2. బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి

ములుగు, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి):బిఆర్ఎస్  పార్టీ(BRS Party) ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని..ఎవరు అధైర్య పడవద్దని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి (Mulugu Constituency In-charge Bade Nagajyothi) అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో(Party office) ములుగు మండల పార్టీ తాజా మాజీ అధ్యక్షులు సానికొమ్ము రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల  సమావేశానికి బి ఆర్ ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి  ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమస్యలు, ప్రజా సమస్యలు, గ్రామస్థాయి పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా కార్యకర్తలు అధైర్యపడకుండా ప్రజల్లో ఉండాలని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు లభించేలా నాయకత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా పనిచేయాలి  గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున ప్రశ్నిస్తూ నిరంతరం పోరాడాలని కార్యకర్తలకు సూచించారు.

గత బి ఆర్ ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, ప్రభుత్వ హయాంలో ములుగు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, ఆయా పనుల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను గ్రామస్థాయిలో చర్చించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రస్తుతం వాటి అమలు పరిస్థితి, ములుగు నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు వంటి అంశాలపై వాస్తవ సమాచారాన్ని సేకరించి ప్రజలకు వివరించాలని అన్నారు .

మంత్రి సీతక్క గెలిచి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్న ములుగు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలకి చెప్పాలన్నారు. పంచాయతీ రాజ్ మంత్రిగా ఉండి మీరు ములుగు నియోజకవర్గ పరిధిలో జరిగిన ప్రధాన అభివృద్ధి ఏంటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకి కరెంట్ కూడా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. 22 ఏ పేరుతో ప్రజల భూములు లాక్కోవాలని ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర పై  కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో నిరంతరం మమేకమై, వారి సమస్యలను తెలుసుకుని, వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు సూచించారు.

రాబోయే పార్టీ కమిటీల్లో యువకులకు పెద్దపేట వేస్తాం అని ఈ సందర్భంగా తెలిపారు. ములుగు గడ్డపై గులాబీ జెండా ఎగరడమే లక్షంగా కార్యకర్తలంతా సమష్టిగా, ఐక్యంగా పనిచేస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని బడే నాగజ్యోతి అన్నారు. ములుగు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ములుగు మండల పార్టీ అధ్యక్షులు సానికొమ్ము రమేష్ రెడ్డి, ములుగు మున్సిపాలిటీ కౌన్సిలర్ల కోగిల లక్ష్మీ, బైకని సాగర్, మాజీ ఎంపీపీ మురళి, సర్పంచులు వీరబోయిన రాజేందర్, తప్పెట్ల రాజేందర్, దాసరి సరిత రమేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కోరం సంతోష్, కుడుముల లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు వేములపల్లి బిక్షపతి, ఎంపీటీసీ పోరం మాజీ అధ్యక్షులు పోరిక విజయరాంనాయక్, కాకి పురుషోత్తం, అకుతోట చంద్రమౌళి, ఉయ్యాల భద్రయ్య, వంకుడోతూ రాందాస్, ముంజల బిక్షపతి, గరిగ రఘు, ఈశ్వరి, రసమల్ల సురేందర్, పైడిమల్ల భాస్కర్, గండి కుమార్, రాణాప్రతాప్, యూనిస్, అనుముల సురేష్, అన్న తిరుపతి ములుగు మండల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు