గౌతమీ తీరాన నదిహారతి విశిష్టత
భద్రాద్రి పురోహితుల సంఘం అధ్యక్షులు రామవజ్జల రవికుమార్
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం దివ్య క్షేత్రంలోని పుణ్య గోదావరి స్నాన ఘట్టాల వద్ద నిర్వహిస్తున్న గోదావరి హారతి భద్రపత బహుళ పాడ్యమి మహాలయ పితృపక్షాలు జరుగుతున్న పవిత్రమైన రోజులు కావడంతో గోదావరి మాతకు శ్రీ సీతారామచంద్ర స్వామి(Sri Sitaramachandra Swamy) వారికి పితృదేవతలకు హారతులు సమర్పించడం జరిగిందని పురోహితులు రామవజల రవికుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య క్షేత్రం భద్రాచలంలోని గోదావరి కరకట్ట ప్రదేశాలలో జరిగిన నదీహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భద్రపద బహుళ పాడ్యమి మహాలయ పితృ పక్షాలు జరుగుతున్న పవిత్రమైన రోజులు రావడం ముఖ్యంగా మొదటి రోజు కావడం చాలా విశేషమైనదని ఆదివారం దివ్య క్షేత్రం భద్రాద్రిలో నిర్వహిస్తున్న గోదావరి హారతి కూడా చాలా విశిష్టమైనదని ఆయన అన్నారు.
అనంతరం పురోహితులు గోదావరి హారతి విశేషాలను మరియు భాద్రపద బహుళ పాడ్యమి మహాలయ పితృ పక్షాలకు సంబంధించిన విశిష్టతను భక్తులకు తెలిపి, గణపతి పూజ, దీపోత్సవం భక్తులచే సృష్టింప చేసి, పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేసి లోక కళ్యాణార్థం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహత్కార్యములో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామానుగ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందుతున్నారని ఆయన అన్నారు.
గోదావరి వరదలు తగ్గి రైతులకు ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేయాలని గోదావరి మాతను పూజించడం జరిగిందని ఆయన అన్నారు. అనంతరం శాంతి మంత్ర పఠనం జరిపి రామ వజ్జల రవి కుమార్ దంపతులు, సత్యనారాయణ రెడ్డి దంపతులు ప్రసాదం పంపిణీ చేయడం జరిగినదని, నదిహారతి కార్యక్రమానికి పూజా సామాగ్రి భద్రాద్రి పురోహితుల సంఘం వారు అందించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు ఉమామహేశ్వర ఆచార్య శ్రీ చక్రపీఠం ఖమ్మం, రామాచార్యులు, సత్య ప్రసాద్ శర్మ, తేజ శర్మ, తిరుపతిరావు, సత్యనారాయణరెడ్డి, శివ, చంద్రశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.