7 July, 2026 | 7:31 PM

Breaking News

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •   ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు   •  

ముచ్చటగా మూడో భాగం

11-07-2024 12:05 AM

లాక్‌డౌన్ టైమ్‌లో ‘మా ఊరి పొలిమేర’ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో నేరుగా స్ట్రీమింగ్ అయింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావటంతో ‘పొలిమేరేొ2’ను తెరకెక్కించగా, అది 2023 ఆఖరున ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సీక్వెల్‌లో కామాక్షి భాస్కర్ల నటనకు గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పొలిమేర ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఇందుకు సం బంధించి అధికారిక ప్రకటన సైతం మేకర్స్ చేశారు. ‘పొలిమేర అనౌన్స్‌మెంట్ సం దర్భంగా బుధవారం రిలీజ్ చేసిన వీడియో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. సత్యం రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, చిత్రం శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తుండగా, భోగేంద్ర గుప్తా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.