3 September, 2026 | 11:07 PM

విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే నా లక్ష్యం

03-09-2026 | 10:31pm

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ,(విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే నా లక్ష్యమని, నాణ్యమైన విద్యతో ఉన్నత శిఖరాలకు విద్యార్థులు చేరుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలం శ్రీ రామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి నృత్యాలు చేసి అందరిని అలరించారు.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ... కళాశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకమైనదని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని భవిష్యత్తులో సమాజానికి, దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, కళాశాల  కమిటీ సభ్యులు, బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండల నాయకులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.