23 August, 2026 | 3:05 AM

నన్ను టార్గెట్ చేశారు

23-08-2026 01:38 AM
  1. బీసీ మహిళా నేతననే గౌరవం కూడా లేదు   
  2. పీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): ‘నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు. సీనియర్ బీసీ మహిళా నాయకురాలినని కూడా చూడకుండా పార్టీ లోని పలువురు ప్రజాప్రతినిధులు, నా యకులు అవమానకర రీతితో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలి’ అని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. ఈ మేర కు శనివారం ఆమె పార్టీ క్రమశిక్షణ కమి టీ చైర్మన్ మల్లు రవికి లేఖ రాశారు.

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చానని మంత్రి సురేఖ తెలిపారు. అయితే విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై పలువురు విమర్శలు చేయడం, తన రాజకీయ భ విష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, తనపై చర్యలకు మీడియా ముందు డిమాండ్ చేయడం బా ధాకరమన్నారు.తనపై తీవ్ర పదజాలంతో సామూహిక దాడులు జరుగుతున్న సమయంలో పార్టీ నాయకత్వం మౌనం వహించ డం ఆందోళన కలిగిస్తోందన్నారు. 

కాంగ్రెస్ అంటేనే.. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీ న వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి వున్న పా ర్టీ అని, ఆ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవా లని కోరారు. తనపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న వారిపైనే కాకుండా, ఈ వ్యవహారా న్ని వెనుకనుంచి నడిపిస్తున్న వ్య క్తులు ఎవరన్నది కూడా  తేల్చాలని విజ్ఞప్తి చేశారు.