20 August, 2026 | 2:38 AM

కౌటాలలో పెద్దపులి సంచారం

20-08-2026 01:04 AM

కౌటల. ఆగస్టు19(విజయక్రాంతి)కౌటాల మండల కేంద్రం సమీపంలో పెద్దపులి సం చారం కలకలం రేపుతోంది. బుధవారం సా యిబాబా ఆలయం సమీపంలో అటవీ అధికారులు పెద్దపులి పాదముద్రలను గుర్తించా రు. ఇళ్లకు ఆనుకుని పులి సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు భ యాందోళనకు గురయ్యారు.అదేవిధంగా గ్రామ శివారులోని వ్యవసాయ చేనులోనూ పులి అడుగులను గుర్తించినట్లు ఎఫ్‌ఎస్‌ఓ తులసీదాస్ నాయక్ తెలిపారు. పాదముద్రలను పరిశీలించిన అటవీ అధికారులు పులి సంచారాన్ని నిర్ధారించే పనిలో ఉన్నారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లవద్దని అటవీ అధికా రులు సూచించారు.