చట్టవిరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ సీజ్
హత్నూర, సెప్టెంబరు 27: అక్రమంగా ఇసుకను రవాణా(Sand transportation) చేస్తున్న ఓ టిప్పర్ను శనివారం హత్నూర పోలీసులు(Hathnoora Police) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పోలీస్ స్టేషన్ పరిధిలోని దౌల్తాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు పగటిపూట నిఘా (డే పెట్రోలింగ్) నిర్వహిస్తున్నారు.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో అటుగా వచ్చిన అశోక్ లేలాండ్ టిప్పర్(Ashok Leyland Tipper) (TS 08 UJ 2466)ను ఆపి తనిఖీ చేయగా అందులో ఇసుక గుర్తించారు. ఇసుక రవాణాకు సంబంధించి ఎలాంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని సీజ్ చేశారు.
డ్రైవర్ షేక్ చాంద్ పాషా (39)ని విచారించగా, యజమాని ఆదేశాల మేరకు ఇస్మాయిల్ఖాన్ పేట్ నక్కవాగు నుంచి గుమ్మడిదలకు ఇసుకను తరలిస్తున్నట్లు అంగీకరించాడు. పోలీసులు టిప్పర్ను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.