క్యూ కాంప్లెక్స్ ఫుల్..VIPలకూ బ్రేక్!

03-10-2026 | 10:19am

తిరుమల(Tirumala)లో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో.. వెలుపల ఏర్పాటు చేసిన క్యూ లైన్లలోనూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం(Sarva Darshan) కోసం సుమారు 30 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 78,445 మంది భక్తులు దర్శించుకున్నారు. 40,098 మంది భక్తులు తలనీలాలు(Tonsure) సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.3 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ(TTD) వెల్లడించింది.

భక్తుల రద్దీ దృష్ట్యా ఎల్లుండి వీఐపీ బ్రేక్ దర్శనాలు(VIP Break Darshan) రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. అలాగే రేపు సిఫార్సు లేఖల స్వీకరణను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు