శ్రీవారి హుండీకి కాసుల జోరు
06-10-2026 | 09:35am
తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi)కి భారీగా ఆదాయం సమకూరింది. గత 9 నెలల్లో హుండీ ద్వారా ఏకంగా రూ.1,129.04 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం.
జూలైలో అత్యధికంగా రూ.140.25 కోట్ల ఆదాయం (Hundi Revenue) లభించింది. ఆగస్టులో రూ.137.44 కోట్లు, సెప్టెంబర్లో రూ.126.41 కోట్లు, జూన్లో రూ.128.30 కోట్ల ఆదాయం సమకూరింది.సెప్టెంబర్ 10న ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ.6.94 కోట్ల ఆదాయం వచ్చింది. భక్తుల రద్దీ (Devotee Footfall) పెరుగుతున్న నేపథ్యంలో హుండీ ఆదాయం కూడా భారీగా నమోదవుతోంది.