నేడు తెలంగాణకు చీకటి రోజు
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై దాడిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
బడంగ్‌పేట్, సెప్టెంబర్ 7 (విజయక్రాం తి): శాసనసభ వద్ద నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం సిగ్గుచేటని పలువురు మీర్ పేట్ బిఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. సబితా ఇంద్రారెడ్డితో పాటు ఇతర బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు ప్రదర్శించిన తీరును నిరసిస్తూ.. బడంగ్పేట్ సర్కిల్ మీర్పేట్ 58వ, 59వ, 60వ డివిజన్లకు చెందిన బిఆర్‌ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి,
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వస్తున్న బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామానికి అంతా మంచిది కాదని హితవు పలికారు. ఈ సంఘటన సీఎం రేవంత్ రెడ్డి ఖండిస్తూ ప్రతిపక్ష నేతలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, కామేష్ రెడ్డి, దీపులాల్ చౌహాన్, శ్రీను నాయక్, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, రాజ్ కుమార్, మాధురి రమేష్, యాదగిరి ముదిరాజ్, సిద్దాల అంజయ్య, సుర్వి లత, మాధవి, సునీత, లలిత, స్నేహలత, పద్మ, బిందు, మోహన్ నాయక్, వెంకటేష్ కుర్మా, ఉప్పాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం..
- బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకులు ముఠా జైసింహ
ముషీరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం చెందిందని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామిలను అమలు చేయాలని ప్రశ్నిస్తే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకులు ముఠా జైసింహ ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలికిచ్చిన హామిలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందడాన్ని నిరసిస్తూ సోమవారం కవాడిగూడ డివిజన్లోని దోమలగూడ జెబి అపార్ట్మెంట్ వద్ద నుంచి ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల సంచులను భుజాన ఎత్తుకొని కవాడిగూడ సర్కిల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కవాడిగూడ సర్కిల్ డిఎంసీ ఆర్. పుష్పలతకు బీఆర్‌ఎస్ నేతలతో కలిసి వినతి పత్రం అందజేశారు.
అనంతరం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను రాకుండా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ముఠా జైసింహ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిలదీస్తారనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని రాకుండా అడ్డుకుందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో గత మూడు సంవత్సరాలుగా ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కవాడిగూడ డివిజన్ మాజీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వల్లాల శ్యామ్ యాదవ్, ఎన్డీ సాయికృష్ణ, నగర నాయకులు కల్వగోపి, వల్లాల శ్రీనివాస్ యాదవ్, రాంచందర్, రాజశేఖర్ గౌడ్, బల్లెకారి రమేష్ ప్రభాకర్, విద్యాసాగర్, సంతోష్ చింతల హరీష్ యాదవ్, వేణుగోపాల్, రాజుయాదవ్, వెంకటేష్ ముదిరాజ్, వై.శ్రీనివాస్ రావు, రాకేష్ కుమార్, ముచ్చకుర్తి ప్రభాకర్, పోతుల శ్రీకాంత్, దామోదర్ రెడ్డి, బింగి నవీన్, శ్రీహరి, శంకర్ ముదిరాజ్, కొండ శ్రీధర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపట్ల పోలీసుల దురుసుపై నిరసన
- ప్రజాప్రతినిధులను అసెంబ్లీలోకి అనుమతించకపోవడం
- ప్రజాస్వామ్యానికి అవమానం: మహ్మద్ ఆజం అలీ
మలక్‌పేట్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎన్నికైన ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని, వారిని అసెంబ్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వారు మండిపడ్డారు.
సోమవారం అజం పురా లోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మలక్పేట నియోజకవర్గం మాజీ ఇన్చార్జ్ మహ్మద్ ఆజం అలీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మహ్మద్ ఆజం అలీ మాట్లాడుతూ.. ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధులను అసెంబ్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం, వారితో దురుసుగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనన్నారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులేనని, ప్రజల సమస్యలు, హక్కులను శాసనసభలో ప్రస్తావించే పూర్తి రాజ్యాంగ, ప్రజాస్వామ్య హక్కు వారికి ఉందని అన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి, నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆజం అలీ డిమాండ్ చేశారు. పోలీసుల వైపు నుంచి ఎలాంటి దురుసు ప్రవర్తన జరిగినట్లు తేలితే బాధ్యులైన అధికారులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ విలువలు, ప్రజల గొంతుకను కాపాడేందుకు తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షం గొంతును అణచివేయడం కాకుండా ప్రభుత్వం ప్రజాస్వామ్య సంప్రదాయాలను గౌరవించాలని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు పూర్తి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ సయ్యద్ లాయక్ అలీ, శ్రీనివాస్రెడ్డి, మహ్మద్ ఫుర్కాన్ అహ్మద్, డాక్టర్ సుమన్, సుధాకర్, ప్రవీణ్ కుమార్, అమీర్, బి.ఎన్.రాజు, జగన్రావు, శ్రీనివాస్రావు, మహేష్, శ్రీధర్రెడ్డి, భూమేష్, ధర్మారాజు, నరేష్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
కూకట్‌పల్లి, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): శేర్లింగంపల్లి నియోజకవర్గం ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి ఎల్లమ్మ బండ చౌరస్తాలో బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, మాధవరం కృష్ణారావు, మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి లను అసెంబ్లీ పాయింట్ వద్ద పోలీసులు అడ్డుకొని అక్రమ అరెస్టులకు నిరసనగా టిఆర్‌ఎస్ నాయకులు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు ఆదర్శ్, ప్రదీప్ రెడ్డి, లడ్డు,రాజు, హర్ష,శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ దాడి అమానుషం
- బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజ్
ముషీరాబాద్, సెప్టెంబర్ 7 (విజయాక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో ఒక చీకటి రోజు అని బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నగేష్ ముదిరాజ్ మండిపడ్డారు. అసెంబ్లీ బయట కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరు ఒక్క దుర్యోధనదుశ్శాసన దుర్మార్గాలకు ప్రతిరూపంగా నిలిచిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వo రౌడీయిజం, నిరంకుశ పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు, పోలీసుల ద్వారా చేయించిన భౌతిక దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీల అమలును కోరుతూ నల్ల టీషర్టులు ధరించి శాంతియుతంగా అసెంబ్లీకి వెళ్తున్న బిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులపై దౌర్జన్యం చేయడం
దుర్మార్గమని పేర్కొన్నారు. నర్సాపూర్ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని లాగడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, మహిళల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలను కిందపడేసి తొక్కి తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు.
మహిళా ప్రజాప్రతినిధిపై జరిగిన దాడికి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై జరిపిన భౌతిక దాడులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని నగేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.
- మహిళా నేతలకు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలి..
- బీఆర్‌ఎస్ నాయకురాలు మాగంటి సునీత గోపీనాథ్
జూబ్లీహిల్స్, సెప్టెంబర్ 7(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ మహిళా నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు మహిళ పట్ల ప్రభుత్వ దృక్పథానికి అద్దం పడుతోందని జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జి మాగంటి సునీత గోపీనాథ్ అన్నారు. సోమవారం ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలిపేందుకు అసెంబ్లీ వద్దకు వెళ్లిన ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అనారికంగా ప్రవర్తించడాన్ని తప్పుబట్టారు.
ఈ విషయమై నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సునీత గోపీనాథ్ మాట్లాడారు. మహిళ నేతలను అవమానించిన పోలీసుల పక్షాన ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను గౌరవిస్తామని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం.. మహిళా ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఎందుకు ఇలాంటి వైఖరిని అవలంబిస్తోందని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలపై అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
మహిళా ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన పోలీసు సిబ్బందిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలకు ఆర్థిక భరోసా, సంక్షేమం, ఉపాధి, భద్రత వంటి అంశాల్లో ఇచ్చిన హామీల అమలు పరిస్థితిపై ప్రభుత్వం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు వాటి గురించి ప్రశ్నిస్తే పోలీసులతో అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
ప్రజల తరఫున, మహిళల తరఫున బీఆర్‌ఎస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు అజయ కుమారి, అమ్మాజీ, అశోక, సువర్ణ, లావణ్య నవీన్ పటేల్, సల్లా శ్రీనివాస్ యాదవ్, ఫహీమ్, అభిలాష్, రెహమాన్, శ్రావణ్, అర్షద్ ఖాన్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
