6 September, 2026 | 9:49 AM

టార్టాయిస్ యూనిక్ థ్రిల్లర్

06-09-2026 | 05:30am

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘టార్టాయిస్’. ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ (Intense Action Thriller) కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు. ఇందులో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నీ పరిచయం..’ పాటను హైదరాబాద్‌లో రిలీజ్ (Released in Hyderabad) చేశారు.

ఈ కార్యక్రమంలో హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ.. “మా మూవీ ఒక యూనిక్ థ్రిల్లర్. థియేటర్స్‌లో ప్రేక్షకులను కంప్లీట్‌గా ఎంగేజ్ చేస్తుంది. త్వరలోనే థియేటర్లలోకి మా మూవీ రాబోతోంది. అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నా” అన్నారు. హీరోయిన్ అమృత చౌదరి మాట్లాడుతూ.. “నీ పరిచయం’ సాంగ్ అందరికీ నచ్చిందని నమ్ముతున్నా. ఈ సాంగ్ షూటింగ్ చేసేప్పుడు మేము చాలా ఎంజాయ్ చేశాం. రావులపాలెంలో ఈ పాట చిత్రీకరణ జరిగింది.

అక్కడ షూటింగ్ చేసినన్ని రోజులు స్థానిక ప్రజలు ఎంతో ప్రేమను చూపించారు. బొబ్బట్లు, చేపలు తీసుకొచ్చి ఇచ్చేవారు. వాళ్ల నిస్వార్థ ప్రేమను చూశాం. ఇలాగే అందరి సపోర్ట్ మా మూవీకి ఉండాలని కోరుకుంటున్నా” అని తెలిపింది. డైరెక్టర్ రిత్విక్ కుమార్ మాట్లాడుతూ.. “సినిమా వేరే లెవెల్‌లో వచ్చింది. బొమ్మరిల్లు, మజిలీ లాంటి చిత్రాలను థ్రిల్లర్ చేస్తే ఎలా ఉంటుందో మా టార్టాయిస్ సినిమా అలా ఉంటుంది. సీట్ ఎడ్జ్‌లో కూర్చుని సినిమా చూస్తారు.

ఈ కథలో ఐదు ట్విస్టులు ఉం టాయి. ప్రతి 25 నిమిషాలకు ఒక బాంబ్‌లా ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఈ ఐదు ట్విస్ట్‌లు ఎవ రూ కనుక్కోలేరు. అందరూ ఫుల్ ఎగ్జైట్ అవుతారు” అని చెప్పారు. ‘త్వరలోనే మా మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం’ అని ప్రొడ్యూసర్ విజయ్ చౌదరి తెలిపారు. ‘మా మూవీ మీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని ప్రొడ్యూసర్ శశిధర్ నల్ల చెప్పారు.

‘మా సినిమాను ఎంతో కష్టపడి, ఇష్టపడి నిర్మించాం. ఈ జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని ప్రొడ్యూసర్ రామిశెట్టి రాంబాబు అన్నారు. నటీనటులు అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, లిరిసిస్ట్ చంద్రబోస్, సింగర్ చిన్మయి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. 

మరిన్ని వార్తలు