రోడ్డు ప్రమాదంలో బైకులు ఢీకొని ఇద్దరి వ్యక్తులు మృతి
27-09-2026 | 03:17pm
ఎర్రుపాలెం సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): మండల పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం–బనిగండ్లపాడు రహదారి(Buchireddypalem–Banigandlapadu Road)పై ఆదివారం నాడు రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు స్థానిక ఎస్సై రమేష్ కుమార్ తెలియజేశారు. ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి మధిర తీసుకపోతుండగా మధ్యలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో చిన్నారికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కృష్ణాజిల్లా మైలవరం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన సకుర్తి రాంబాబు, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొరకుప్పుల ప్రేమ్‌కుమార్ మృతి చెందారు.