వైభవ్ ఎదురుచూడాల్సిందే

19-09-2026 | 05:05am
  1. సీనియర్లకే ప్రాధాన్యత ఇస్తామన్న గంభీర్ 
  2. వరల్డ్ కప్‌కు కాంబినేషన్ కుదరాలి
  3. ఒకట్రెండు వైఫల్యాలకు  తప్పించలేం

ముంబై , సెప్టెంబర్ 18 : ఆఫ్గనిస్తాన్(Afghanistan)తో టీ ట్వంటీ సిరీస్‌(T20 series)లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి(Vaibhav Suryavanshi) అవకాశం దక్కకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తా జాగా దీనిపై టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్(Team India Head Coach Gautam Gambhir) స్పందించాడు. వైభవ్ తన అవకాశం కోసం మరికొంత కాలం సహనంతో వేచి చూడాల్సిందే అని స్పష్టం చేశాడు. గత రెం డు మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్న సంజు శాంసన్(Sanju Samson) లాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లకే తాము మొదటి ప్రాధాన్యత ఇస్తామని గంభీ ర్ పేర్కొన్నాడు.

ఆటగాడి వయసు 15 ఏళ్లయినా లేదా 30 ఏళ్లయినా, జట్టులో తీవ్ర మైన పోటీ ఉన్నప్పుడు తమ అవకాశం వచ్చే వరకు ఓపికగా ఎదురుచూడాలని గంభీర్ తే ల్చిచెప్పాడు. వైభవ్ అద్భుతమైన ప్రతిభావంతుడని, అతని సామర్థ్యంపై ఎవరికీ సందేహా లు లేవని కోచ్ ప్రశంసించాడు. భవిష్యత్తు లో వైభవ్‌కు అవకాశం లభించినప్పుడు, అ తను సుదీర్ఘకాలం పాటు జట్టులో కొనసాగుతాడని భరోసా ఇచ్చాడు. రాబోయే ప్రపంచకప్ కోసం జట్టు కూర్పును దృష్టిలో ఉంచుకుని, శాంసన్, అభిషేక్ శర్మల ఓపెనిం గ్ కాంబినేషన్‌ను కొనసాగించడానికే మొగ్గు చూపినట్లు తెలిపాడు.

ఒకటి రెండు సిరీస్‌ల లో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్లు చెడ్డవాళ్లు అయిపోరని సీనియర్లకు మద్దతుగా నిలిచాడు. ఈ సిరీస్‌తో సంజూ శాంసన్ తా నేంటో మరోసారి నిరూపించుకున్నాడని వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా వైభవ్ కోసం శాంసన్‌ను పక్కన పె ట్టాల్సి రావడం తన కోచింగ్ కెరీర్‌లోనే అ త్యంత కఠినమైన నిర్ణయమని చెప్పాడు.

ప్రపంచ కప్ సాధించిన జట్టును తిరిగి కొనసాగించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశాడు. జింబాబ్వే పర్యటనలోను, ఐపీఎల్ 2026 లోనూ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, ప్రస్తుత టీమిండియా లైనప్‌లో ఉన్న గట్టి పోటీ కారణంగా మరికొంత కాలం డగౌట్‌కే పరిమితం కాక తప్పడం లేదు.

మరిన్ని వార్తలు