4 September, 2026 | 10:51 PM

Breaking News

అబద్దాల కాంగ్రెస్ ని తరిమి కొట్టండి   •   ఉమ్రిలో ఘనంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం   •   శిరీష కుటుంబానికి అండగా నిలవాలి   •   మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •  

భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత

04-09-2026 | 09:51pm

శ్రీ కాత్యాయని సమేత సిద్దేశ్వర స్వామి ప్రతిష్ఠ మహోత్సవంలో వంగ రాజేశ్వర్ రెడ్డి..

సిద్దిపేట రూరల్: పట్టణంలో నిర్వహించిన శ్రీ కాత్యాయని సమేత సిద్దేశ్వర స్వామి(Sri Katyayani Sametha Siddheswara Swamy) ప్రతిష్ఠ మహోత్సవంలో వంగ రాజేశ్వర్ రెడ్డి(Vanga Rajeshwar Reddy) ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షించారు.

ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావనతో పాటు ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిష్ఠ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.