21 August, 2026 | 7:45 PM

ఘనంగా వరలక్ష్మీ వ్రత మహోత్సవం

21-08-2026 06:59 PM

కల్లూరు,(విజయక్రాంతి): శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా మండలంలో వరలక్ష్మీ వ్రత మహోత్సవాన్ని మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.వేకువజామునే మహిళలు ఇళ్లను శుభ్రం చేసుకుని,మంగళస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహాలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహించి, వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు.

కల్లూరులోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంతో పాటు ఎన్‌ఎస్‌పీలోని శ్రీ మారెమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు.ఆలయాలకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.కుటుంబాల్లో సుఖసంతోషాలు,ఆయురారోగ్యాలు,ఐశ్వర్యం కలగాలని అమ్మవారిని ప్రార్థించారు.దీంతో మండలంలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.