జిల్లా స్థాయికి వేదం పాఠశాల విద్యార్థి ఎంపిక
27-09-2026 | 04:17pm
జోనల్ స్థాయి అండర్ నాలుగు విభాగంలో
బోథ్ సెప్టెంబర్ 27 ( విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన వేదం పాఠశాల(Veda School)లో ఏడవ తరగతి విద్యార్థిని అండర్ 14 విభాగంలో జోనల్ స్థాయి కరాటే పోటీలకు(Zonal level karate competitions) ఎంపికయ్యారు. మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన మునిగేల మహ శ్రీ(Maha Sri) జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో ఎంపికయ్యారు. విద్యార్థిని ఎంపిక(Student Selection) పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ పచ్చిపాల సంతోష్ హర్షం వ్యక్తపరిచారు. కరాటే మాస్టర్ రాజేశ్వర్ ను అభినందించారు.