చేయూత పింఛన్ల పరిశీలన
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా పర్యవేక్షిస్తున్న సర్పంచ్ బండారి కృష్ణాజి
వాంకిడి, (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చేయూత పథకంలో భాగంగా అర్హులైన వ్యక్తులకు పింఛన్ అందించే ప్రక్రియలో భాగంగా వాంకిడి మండలంలోని బంబార గ్రామ పంచాయతీలో(Bambara Gram Panchayat) సోమవారం దరఖాస్తుల పరిశీలన వెరిఫికేషన్ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తి ఇంటికి వెళ్లి అధికారులు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దరఖాస్తుదారుల అర్హతలు, వివరాలను పరిశీలించి వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టారు.
ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బెండారే కృష్ణాజి పర్యవేక్షించారు. ఎంపీవో ఖాజా అజీస్ఉద్ధీన్ తో పాటు సంబంధిత సిబ్బంది పాల్గొని దరఖాస్తుల పరిశీలన నిర్వహించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం అందేలా వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్, పంచాయతీ కార్యదర్శి ధర్మయ్య పాల్గొన్నారు.