సెప్సిస్‌పై అప్రమత్తతే ప్రాణరక్షణ

13-09-2026 | 05:25am
  1. ఇన్ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేయొద్దు
  2. మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

హైదరాబాద్, సెప్టెంబర్ 12(విజయక్రాం తి): ప్రపంచ సెప్సిస్ దినోత్సవం (సెప్టెంబర్ 13) సందర్భంగా ఎల్లమ్మ గుట్టలోని మెడికవర్ హాస్పటల్‌లో (Medicover Hospital) శనివారం వైద్యులు అవ గాహన కార్యక్రమం నిర్వహించారు. సెప్సిస్, తీవ్రమైన ఇన్ఫెక్షన్లపై అవగాహన పెంచడం అత్యంత ఆవశ్యకమని వైద్య నిపుణులు స్ప ష్టం చేస్తున్నారు. శరీరంలో ఏర్పడే ఒక చిన్న ఇన్ఫెక్షన్ ప్రాణాంతకమైన పరిస్థితిగా మారడమే ‘సెప్సిస్’.

దీనికి సకాలంలో సరైన చికి త్స అందించకపోతే అవయవాలు విఫలమై ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. సెప్సిస్ వంటి అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, ఎంతోమంది బాధితులకు పునర్జన్మ నివ్వడంలో మెడికవర్ హాస్పిటల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అత్యాధునిక ఐసీయూ సౌకర్యాలు, 24/7 ఎమర్జెన్సీ సేవలు, నిపుణులైన వైద్య బృం దంతో కూడిన ‘మల్టీడిసిప్లినరీ అప్రోచ్’ ద్వా రా మెడికవర్ హాస్పిటల్స్ సెప్సిస్ చికిత్సలో ఉత్తమ ఫలితాలను అందిస్తోంది.

క్రిటికల్ కేర్ విభాగం డాక్టర్ రమేష్ బొల్లిశెట్టి మాట్లాడుతూ సెప్సిస్ అనేది శరీరంలో ఇన్ఫెక్షన్‌ను నిరోధక వ్యవస్థ తీవ్రంగా ప్రతిస్పందించినప్పుడు ఏర్పడే ప్రాణాంతకమైన అత్యవసర పరిస్థితి. మెడికవర్ హాస్పిటల్స్లోనిమా క్రిటికల్ కేర్ విభాగం (ఐసీయూ) అత్యంత అధు నాతన లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, కంటికి రెప్పలా కనిపెట్టే మానిటరింగ్ ద్వారా రోగికి వేగవంతమైన ఆర్గాన్ సపోర్ట్ అందిస్తుంది.

అనస్థీషి యాలజీ విభాగం డాక్టర్ వేణు, డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ ‘సెప్సిస్ తీవ్ర రూపం దాల్చినప్పుడు రోగి రక్తపోటు, శ్వాసక్రియ దెబ్బతింటాయి. అలాంటి సమయాల్లో అ డ్వానస్డ్ ఎయిర్‌వే మేనేజ్మెంట్, వీఐపీ విజిలెన్స్, శరీరంలో కీలక అవయవాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా నిరంతరం జరిగేలా చూడటంలో అనస్థీషియాలజీ విభాగం కీలక పా త్ర పోషిస్తుంది. సంక్లిష్టమైన సర్జికల్ లేదా ఇంటెన్సివ్ కేర్ కేసులలో వేగవంతమైన స్టెబిలైజేషన్ మా ప్రాధాన్యత’ అని అన్నారు.

ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ ఫణి కృష్ణ , డాక్టర్ జి రాహుల్ మాట్లాడుతూ ‘సెప్సిస్ చికిత్సలో ’గోల్డెన్ అవర్’ (మొదటి గంట) అత్యంత కీలకమైనది. రోగి ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌కు  రాగానే ప్రాథమిక లక్షణాలను గుర్తించి, వేగవంతంగా బ్లడ్ కల్చర్స్, యాంటీబయోటిక్స్ ప్రారంభించడం ద్వారా ప్రాణాపాయాన్ని అధిగమించవచ్చు.

మెడికవర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ విభాగం 24 గంటలూ సజ్జమై, రోగి చేరిన తక్షణమే వేగవంతమైన చికిత్సను అందిస్తుంది’ అని తెలిపారు.‘ఇన్ఫెక్షన్లను సకాలంలో గుర్తించండి..సెప్సిస్ బారిన పడకుండా ప్రాణాలు కాపాడండి’ అనేది ఈ ప్ర పంచ సెప్సిస్ దినోత్సవం సందేశం. 

మరిన్ని వార్తలు