రాజకీయ ఒత్తిడికి తట్టుకోలేక బదిలీలు

01-10-2026 | 03:09pm
  1. పని భారంతో సతమతమగుతున్న గ్రామ కార్యదర్శిలు.
  2. కార్యదర్శులపై అధికారుల సర్పంచుల ఒత్తిడి. 

బోథ్. అక్టోబర్ 1 ( విజయక్రాంతి) జిల్లాలోనీ వివిధ గ్రామపంచాయతీలో (Gram Panchayat)పనిచేస్తున్న గ్రామాల కార్యదర్శులు పని భారంతో ప్రతిరోజు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా కొంతమంది కార్యదర్శిలు ఉద్యోగాలను విడిచిపెట్టి వేరే ఉద్యోగాల్లోకి వెళ్తున్నారు. అంతేగాక పని భారాన్ని తట్టుకోలేక అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. 

రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక...

గ్రామాల కార్యదర్శిల పైన రాజకీయ ఒత్తిళ్లు అధికం కావడంతో పనులు చేయాలా వద్దా అన్న ఆలోచనలో పడుతున్నారు. వివిధ పనులకు తీర్మానాలు వ్రాసి ఇవ్వడంలో కార్యదర్శులు అవుతున్నామని వాపోతున్నారు. కొన్ని గ్రామపంచాయతీలలో ప్రతిపక్ష పార్టీల సర్పంచులు ఉంటే అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు అధికమవుతున్నాయి. దీంతో కార్యదర్శులు ఆయా గ్రామాల నుండి బదిలీలకు సిద్ధమవుతున్నారు.

ముఖ్యంగా మహిళ కార్యదర్శుల పైన ఒత్తిడి అధికంగా ఉంటుందని వాపోతున్నారు. ఉదయం 9 గంటలకి గ్రామపంచాయతీ కార్యాలయాలకు వెళ్లి మధ్యాహ్నం పూట మండల కేంద్రానికి వచ్చి ప్రభుత్వం నుండి వచ్చే సమాచారాన్ని అమలు చేసేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడాల్సి ఉంటుంది. అంతేగాక మీటింగులు నిర్వహిస్తున్నప్పుడు కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది.

ఒకవైపు ఎంపీడీవోలు మరోవైపు ఎంపీ ఈవోలు గ్రామాల సర్పంచులు, సమావేశాలలో పాల్గొనాల్సి వస్తున్నది. ఒక్కో రోజు రెండు మూడు మీటింగులు హాజరు కావాల్సి వస్తుందని అంటున్నారు. మరోవైపు జిల్లా కేంద్రాలలో నిర్వహించే సమావేశాలకు వెళ్లాల్సి వస్తున్నది. అసలే పని భారం ఆపైన రాజకీయ అధికారుల ఒ త్తిళ్లతోలతో ఆందోళనకు గురవుతున్నారు.

బదిలీ లకు సిద్ధం..

కొన్ని గ్రామాలలో తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో కార్యదర్శులు బదిలీలకు సిద్ధపడుతున్నారు. మార్మూలన ఉన్న గ్రామాలను ఎంపిక చేసుకొని ప్రశాంతంగా అభివృద్ధి పనులనుచేపట్టవచ్చని అంటున్నారు. దూర పరమైన మానసిక ప్రశాంతత ఉంటుందని కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఇటు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లలేక గ్రామపంచాయతీలకు చేరుకోక ఇబ్బందులు పడుతున్నారు. 

పని భారం అధికం...

గ్రామాల కార్యదర్శులకు పనిభారం అధికంగా ఉంటుందని ఫలితంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామ కార్యదర్శిల సంఘం అధ్యక్షులు అశోక్ వాపోయారు. రాజకీయ ఒత్తిళ్లతో పాటు ప్రభుత్వ పరంగా చేపట్టే పనులు సైతం ఇబ్బంది కరంగా మారాయని అంటున్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించి తగు న్యాయం చేయాలని ఆయన వాపోయారు.

మరిన్ని వార్తలు