స్మశాన వాటికకు దారి లేక గ్రామస్థుల అవస్థలు
21-09-2026 | 05:30pm
బేల,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని స్మశాన వాటికకు సరైన దారి లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్మశాన వాటిక(Cemetery)కు వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో వర్షాకాలం(Rainy season)లో నీరు నిలిచిపోతోంది. దీంతో మృతదేహాలను స్మశాన వాటికకు తరలించేందుకు గ్రామస్థులు(Villagers) నీళ్లలో నుంచే శవపేటికను మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. స్మశాన వాటికకు వెళ్లేందుకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.